రిలయన్స్ జియో కోసం ఎగబడుతున్న వారికి చేదువార్త !
ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు డేటాను అందిస్తున్నట్లు ప్రకటించి, ఇతర టెలికాం కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన రిలయన్స్ జియో చావు కబురు చల్లగా చెప్పింది. రిలయన్స్ జియో సిమ్ తీసుకున్న వారు వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా డిసెంబర్ 31 వరకూ అపరిమిత డేటా, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని ముఖేష్ అంబానీ ప్రకటించారు. అయితే, ఈ మాటలో వాస్తవం లేదని తాజాగా కంపెనీ వివరించిన ప్రకటనలో తేలింది...!
రోజు మొత్తం అపరిమిత డేటా ఇవ్వడం లేదని, 4జీబీ మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిసింది. 4జీబీ కంటే ఎక్కువగా నెట్‌ను వినియోగిస్తే కనీసం బ్రౌజింగ్ కూడా కష్టమేనని ఈ సిమ్ యూజర్లు చెబుతున్నారు. 128 కేబీపీఎస్ స్పీడ్‌తో నెట్ అందుబాటులో ఉంటుందని తాజాగా కంపెనీ వెల్లడించింది. ఈ సిమ్‌ను ఉపయోగించి సినిమాలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా చేదువార్తనే చెప్పాలి. హెచ్‌డీ సినిమా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కనీసం సినిమా నిడివిని బట్టి 1జిబి నుంచి 3జిబి వరకూ ఉంటుంది. ఇలాంటి వారు కంపెనీ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిలయన్స్ జియో తాజాగా పెట్టిన షరతుల చిట్టా ఇది...!
No comments:
Post a Comment